అన్నాదమ్ముల పోరాటమే ‘బాహుబలి’ – రానా

అన్నాదమ్ముల పోరాటమే ‘బాహుబలి’ – రానా

Published on Jun 19, 2015 12:17 AM IST

rana-in-baahubali
టాలీవుడ్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’. సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రెండేళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా చెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ చిత్ర టీం ప్రమోషన్స్ ని ముంబైలో మొదలు పెట్టారు. మీడియాతో మాట్లాడిన రానా ఈ సినిమా గురించి చెబుతూ ‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి’ సినిమా అని తెలిపాడు.

బాహుబలి సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – రానా అన్నదమ్ములుగా కనిపించనున్నారు. అందులోనూ ప్రభాస్ బాహుబలి, శివుడు అనే రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. బాహుబలి పాత్రకి జోడీగా అనుష్క కనిపించనుంటే, శివుడు పాత్రకి జోడీగా తమన్నా కనిపించనుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు