షాకింగ్ – బాహుబలి గుంటూర్ కలెక్షన్స్ రిపోర్ట్

Baahubali-still
తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతిని ఒక్కసారి ఇండియన్ సినిమాకి పరిచయం చయడమే కాకుండా ఇంటర్నేషనల్ సినిమాని కూడా ఒక్కసారి మనవైపు తిప్పుకునేలా చేసిన గ్రాఫికల్ విజువల్ వండర్ ‘బాహుబలి’. గత శుక్ర వారం వరకూ వెయిటింగ్ వెయిటింగ్ అని ఎదురు చూసారు, రిలీజ్ అయిన రోజు నుంచీ అందరూ రికార్డ్ బ్రేక్ చేస్తున్న అన్ని కలెక్షన్స్ ని నోట్ చేసుకునే పనిలో పడ్డారు. బాహుబలి సినిమా చిన్న టౌన్ నుంచి ఓవర్సీస్ దాకా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో ఫస్ట్ వీకెండ్ లో ఆల్ టైం రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. తెలుగు చలన చిత్ర సీమలో ఇప్పటి వరకూ రికార్డ్ అయిన ప్రతి ఒక్క పాత రికార్డ్ ని బద్దలు కొడుతోంది.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం గుంటూరులో మొదటి మూడు రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ నమోదు చెయ్యడమే కాకుండా దాదాపుగా 4 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. మొత్తం మూడు రోజుల్లో 3.97 కోట్ల షేర్ రికార్డ్ అయ్యింది. గుంటూరులో మొదటి వారం ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడంతో మొదటి వారం లోపు సుమారు 6 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు మొదటి మూడు రోజుల షేర్ వివరాలు..

వారం కలెక్షన్స్ (షేర్)
శుక్ర వారం 2.53 కోట్లు
శని వారం 0.63 కోట్లు
ఆది వారం 0.81 కోట్లు
మొత్తం 3.97 కోట్లు
Exit mobile version