‘మహాభారతం’ ముందు ‘బాహుబలి’ చాలా చిన్నది – రాజమౌళి

rajamouli
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరాజయంలేని దర్శకుడు, తను అనుకున్నది అనుకున్నట్టుగా తెరపై ఆవిష్కరించదగిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఏడాది రాజమౌళి క్రియేట్ చేసిన సరికొత్త ప్రపంచం పేరు ‘బాహుబలి’. ప్రస్తుతం రాజమౌళి ఈ బాహుబలి సీక్వెల్ ని తీయడానికి అన్ని పనులను సిద్దం చేసుకుంటున్నాడు. బాహుబలి అనే సినిమా రాజమౌళికి ఇంటర్నేషనల్ గా గుర్తింపు తెచ్చింది. అలాంటి రాజమౌళి కోరిక ఏంటి అంటే ‘మహాభారతం’ ని తెరపై ఆవిష్కరించడమే..

అందుకే రాజమౌళి ఎప్పుడూ నేను చేసే ప్రతి సినిమా మహాభారతం తీయడానికి హెల్ప్ అయ్యేలాచూసుకుంటానని చెప్తుంటాడు. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత రాజమౌళికి మహాభారతం తీయగల టెక్నికల్ నాలెడ్జ్ కూడా వచ్చేసిందని అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన ముందు ఉంచితే.. ‘అలా అనుకోవడం వారి అభిమానం.. కానీ నా మదిలో ఉన్న మహాభారతం అనేది చాలా పెద్దది.. దానితో పోల్చుకుంటే బాహుబలి అనేది చాలా చిన్నది. లాగే మహా భారతాన్ని తీయడానికి నాకున్న అనుభవం మరియు టెక్నికల్ నాలెడ్జ్ సరిపోదు. ఇంకా నేర్చుకోవాలని’ అన్నాడు.

ప్రస్తుతం బాహుబలి 2 కి సంబందించిన సెట్స్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 14 నుంచి ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు.

Exit mobile version