
మన కళ్ళు రెప్ప వేయకుండా చూసే భారీ సెట్స్, ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్, ఇవన్నీ చూస్తూ కూడా మనం చూస్తున్నది తెలుగు సినిమానేనా అని ఒకింత ఆశ్చర్యం, ఒకింత గర్వంగా ఫీలయ్యేలా చేసే సినిమా ‘బాహుబలి’. మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి రోజు నుంచే అన్ని చోట్లా రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్ మరియు సౌత్ ఇండియా ఆల్ టైం రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.
అలాగే ఏరియా ప్రకారం చూసుకుంటే నైజాంలో బాహుబలి సినిమా ట్రేడ్ వర్గాలను షాక్ చేసేలా కలెక్షన్స్ వసూలు చేస్తోంది. మొదటి వారంలోనే 22 కోట్లకి పైగా షేర్ సంపాదించిన ఈ సినిమా సెకండ్ వీకెండ్ లో సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం టోటల్ లాంగ్ రన్ లో బాహుబలి ఒక్క నైజాం ఏరియాలోనే 40 కోట్ల షేర్ మార్క్ ని కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆర్కా మీడియా వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

