‘బాహుబలి’తో డాల్బీ అట్మాస్ శకానికి బీజం..!

Baahubali-still
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో రేపు (జూలై 10న) భారీ ఎత్తున ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు ఈ స్థాయి అంచనాలతో, ఇన్ని ప్రత్యేకలతో కొన్ని దశాబ్దాలుగా వేరే ఇతర సినిమా ఏదీ విడుదల కాలేదంటే అతిశయోక్తి కాదు.

ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలోనే అతి పెద్ద బడ్జెట్ సినిమా కావడంతో పాటు డాల్బీ అట్మాస్ అనే సౌండ్ సిస్టమ్‌కు సరికొత్త అవకాశాలను చూపిన సినిమాగా కూడా నిలవబోతోంది. 2012లో ఇండియాలో తెరపైకి వచ్చిన ఈ డాల్బీ అట్మాస్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకున్న థియేటర్లు ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. బాహుబలి లాంటి సినిమా ఈ సిస్టమ్‌లో రావడంతో చాలామంది ఈ సిస్టమ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడాన్ని చూడొచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సిస్టమ్‌ను అందిస్తున్న థియేటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇక ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించగా, కీరవాణి స్టన్నింగ్ మ్యూజిక్‌తో రేపు రానున్న ఈ సినిమా సౌండ్ విభాగంలో కచ్చితంగా ఓ ప్రత్యేకతను చాటి మున్ముందు మరిన్ని సినిమాలు ఈ సిస్టమ్‌తో విడుదలయ్యే అవకాశముంది.

Exit mobile version