గిన్నిస్ వరల్డ్ రికార్డుతో ‘బాహుబలి’..!

bahubali
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా సృష్టిస్తోన్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమా అంటూ పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కించుకున్న బాహుబలి, రికార్డుల వేటలో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. బాహుబలి రిలీజ్‌కు ముందే సృష్టించిన ఓ ప్రత్యేకమైన రికార్డుకు ప్రస్తుతం అధికారిక ఆమోదం లభించింది.

బాహుబలి మళయాల ఆడియో రిలీజ్ వేడుక సందర్భంగా బాహుబలి టీమ్ ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా ఆవిష్కరించనంత సైజులో అతిపెద్ద పోస్టర్‌ను ఆవిష్కరించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. సుమారు 4,793 చ.మీల పోస్టర్ ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్‌గా రికార్డుకెక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.

Exit mobile version