‘అత్తారింటికి దారేది’ రికార్డ్ ని బ్రేక్ చేసిన ‘బాహుబలి’

baahubali-ad-m
తెలుగు చలన చిత్ర దశ, దిశని మార్చి తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్ళి ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేసిన సినిమా ‘బాహుబలి’. అంతే కాకుండా బాహుబలి సినిమా అన్ని రికార్డ్ లని మొదటి వారంలోనే బద్దలు కొట్టేస్తోంది. మొదటి 4 రోజుల్లో తెలుగు చలన చిత్ర సీమ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ కి క్రాస్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఇప్పటి వరకూ లాంగ్ రన్ లో 75కోట్లకి పైగా షేర్ తో టాలీవుడ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది రికార్డ్ ని కేవలం నాలుగురోజుల్లో బ్రేక్ చేసి అందరినీ షాక్ కి గురి చేసిన సినిమా బాహుబలి.

75 ఏళ్ళ సినిమా చరిత్రలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిన పోకిరి సినిమా రికార్డ్ ని మగధీర సినిమా 9 రోజుల్లో బ్రేక్ చేసింది. ఆ తర్వాత మగధీర నెంబర్ 1 రికార్డ్ ని అత్తారింటికి దారేది సినిమా 25 రోజుల్లో క్రాస్ చేసింది. కానీ అత్తారింటికి దారేది ఆల్ టైం రికార్డ్ ని కేవలం 4 రోజుల్లోనే బాహుబలి క్రాస్ చేసింది. ప్రస్తుతం ట్రేడ్ పండితులు చెబుతున్న ప్రకారం నాలుగవ రోజుతో బాహుబలి తెలుగులో 80 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఓవరాల్ గా కూడా ఎవరూ టచ్ చేయలేని ఓ రికార్డ్ ని సృష్టిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

సక్సెస్ కి మారుపేరైన ఎస్ఎస్ రాజమౌళి – ఆరడుగుల ఆజానుభాహుడు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకొని సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. రానా, తమన్నా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణలు ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version