అద్భుత: అనిపించిన ‘బాహుబలి’ టీజర్!

rana-in-baahubali
రాజమౌళి ఏదిచేసినా సరికొత్తగా ప్లాన్ చేస్తారన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో తన సినిమాలకు అంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన రాజమౌళి, ‘బాహుబలి’ విషయంలో మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. బాహుబలి ఆడియో రిలీజ్ వాయిదా పడిందన్న బాధలో ఉన్న అభిమానులకు జూన్ 1న ట్రైలర్, ఈరోజు సాయంత్రం ఓ చిన్న టీజర్ విడుదల చేస్తామన్న వార్తతో బాహుబలి టీమ్ తీపి కబురు తెలియజేసిన విషయం తెలిసిందే!

కొద్దిసేపటి క్రితమే ఈ టీజర్‌ను రాజమౌళి వినూత్నంగా విడుదల చేశారు. హీరోయిన్‌గా నటించిన అనుష్క ట్విట్టర్‌లో వీడియో చాట్ చేస్తూ విడుదల చేయగా.. రాజమౌళి, రానా ఇద్దరు కలిసి టీవీ 5 స్టూడియోలో టీజర్‌ను విడుదల చేశారు. ఈ పది సెకండ్ల టీజర్‌ చూసిన వారెవ్వరైనా వారెవ్వా అనకుండా ఉండలేరు. కేవలం ఐదారు షాట్స్ చూస్తేనే ఈ స్థాయి అనుభూతి కలిగితే ఇక సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందోనని అభిమానులు సోషల్ మీడియోలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. బీభత్సకరంగా ఉన్న రానాను, రౌద్రరసం నిండిన ప్రభాస్ కళ్ళను ఈ టీజర్‌లో చూడొచ్చు. ఇక జూన్ 1న ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పుడు బాహుబలి అభిమానుల కళ్ళన్నీ ఆ ట్రైలర్‌పైనే..!

‘బాహుబలి’ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version