మరో 7 దేశాల్లో రిలీజ్ కానున్న ‘బాహుబలి’

BAAHUBALI
ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేసిన ఇండియన్ బిగ్గెస్ట్ పీరియడ్ ఫిల్మ్ బాహుబలి. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడంలో కూడా ఎవ్వరూ ఊహించని కలెక్షన్స్ సాధించి అందరినీ షాకింగ్ కి గురి చేసింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఈ చిత్ర టీం ఉంది. అందులో భాగంగా మొదటగా చైనాలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవలే జరిగిన బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి సినిమాని ప్రదర్శించారు. అక్కడి వారికి నచ్చడంతో జపాన్ లో కూడా రిలీజ్ చెయ్యడానికి సిద్దమయ్యారు. ఇప్పుడు మరో 7 ఏసియా కంట్రీస్ లో రిలీజ్ చెయ్యడానికి ఓ సంస్థ సిద్దమైంది. బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలి సినిమా చూసిన ఎం.వి.పి ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని కొనుక్కున్నారు. దానికి సంబందించిన అగ్రిమెంట్స్ కూడా బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనే పూర్తయ్యాయి. ఎం.వి.పి ఎంటర్టైన్మెంట్ వారు ఇండోనేషియా, థాయ్ ల్యాండ్, వియత్నాం, లాస్, కంబోడియా, మయన్మార్, టిమోర్ లిస్టే దేశాలలో బాహుబలిని రిలేజే చేయనున్నారు. మొదట ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసిన బాహుబలి, ఇప్పుడు ఏషియా మార్కెట్ ని షేక్ చేయడానికి సిద్దం అవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

Exit mobile version