బల్గేరియా షెడ్యూల్ కంప్లీట్ చేయనున్న ‘బాహుబలి’ టీం

Baahubali
ప్రభాస్, అనుష్క, తమన్నా నటీనటులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’. బల్గేరియాలో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ రేపటితో పూర్తవుతుంది. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ షెడ్యూల్ లో ప్రభాస్, తమన్నాలపై బల్గేరియాలో కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ పార్టును చిత్రీకరించారు.

తాజా మూవీ యూనిట్ విడుదల చేసిన ‘ది వరల్డ్ అఫ్ బాహుబలి’ వీడియోకి అద్బుత స్పందన లభించింది. సినిమాపై క్రేజ్ రెట్టింపైంది. బర్త్ డే టీజర్లు, తారల ఫస్ట్ లుక్స్ విడుదలతో ముహూర్తం జరిగిన రోజు నుండి ‘బాహుబలి’పై జాతీయ స్థాయిలో భారి క్రేజ్ ఏర్పడింది. రెండేళ్ళ సుదీర్గ కాలం పాటు షూటింగ్ జరిగినా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

దగ్గుబాటి రానా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేష్ ఇతర పాత్రధారులు. యం.యం.కీరవాణి సగీతం అందిస్తున్నారు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. 2015 వేసవిలో మొదటి పార్ట్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version