భారతీయ సినిమా ఎంతో గర్వించదగ్గ సినిమా ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలు అని చెప్పొచ్చు. ఆయితే దీనికి సంబంధించి పలు సిరీస్ లు వెబ్ కంటెంట్ లు ఓటీటీ లలో చాలానే వచ్చాయి. అలా లేటెస్ట్ గా వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ నే బాహుబలి ది టార్చ్ బేరర్.
దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చిన ఈ స్పెషల్ డాక్యుమెంటరీ సినిమా తారాగణపు ముచ్చట్లుతో వచ్చింది. ఇక ఇందులో డార్లింగ్ హీరో ప్రభాస్ బాహుబలి పార్ట్ 3 ని అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాన్స్ లో ఒకింత షాకింగ్ గా మారింది. మొత్తం 4 ఎపిసోడ్స్ సిరీస్ గా వచ్చిన దీని నుంచి ప్రభాస్, రానా అలాగే అనుష్కలు కలిసి మాట్లాడుతూ బాహుబలి లెగసి ఆగలేదు అని పార్ట్ 3 కూడా ఉందని కన్ఫర్మ్ చేసారు. దీనితో ఈ బిగ్ అనౌన్స్మెంట్ పట్ల అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
