చరిత్ర సృష్టించిన బాహుబలి ట్రైలర్

Baahubali
‘బాహుబలి’ సినిమా ఆడియో విడుదల వేడుక వాయిదాపడడంతో రాజమౌళి వెనకడుగు వేశాడని విమర్శలను ఎదుర్కున్నాడు. అయితే జూన్ 1న విడుదలచేసిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు మించి వుండడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

నమ్మశక్యంకానీ కళ్ళు చెదిరే విజువల్స్ తో ఈ ట్రైలర్ విడుదలైన 24గంటల లోపే 1మిలియన్ వ్యూస్ ని దాటింది. ఒక తెలుగు సినిమా ఇది ఇప్పటివరకూ సాధించని అరుదైన రికార్డు.

ఈ చిత్ర హిందీ వెర్షన్ ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు కమ్ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశారు. బాహుబలిని ఆర్కా మీడియా సంస్థ నిర్మించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version