
బాహుబలి సినిమా బృందం ఈ మధ్య విరివిగా వీడియోలను విడుదలచేస్తుంది. ఈ సినిమాని ప్రేక్షకులు మర్చిపోకుండా చూస్కుంటున్నారు. ఇటీవలే రానా, ప్రభాస్ మరియు అనుష్కలు జిమ్ లో పుష్ అప్స్ తీస్తూ ఒక వీడియోని విడుదలచేశారు
ఈ ఫన్నీ వీడియోలో నాజర్, సత్యరాజ్ లు కూడా వున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకుల మధ్య ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. రానా ప్రభాస్ లో ఎంతో ఈజ్ తో వ్యాయామాలు చేస్తున్నట్లు తెలుస్తుంది
విచిత్రమేమిటంటే వీరిద్దరికీ అనుష్క గట్టి పోటీనిచ్చింది. రోజుకి 3 గంటలు కసరత్తు చేస్తున్న ప్రభాస్ భారీ దేహాన్ని ఓ లుక్ కూడా వేయచ్చు
ధృడమైన శరీరం కోసం వీరు చాలా కష్టపడుతున్నారు. ఇటీవలే పీటర్ హెయిన్స్ స్టైల్ ని వివరిస్తూ మరో వీడియో కూడా విడుదలచేసారు. సినిమా ప్రచారానికి ఈ వీడియోలు బాగా ఉపయోగపడుతున్నాయనే చెప్పాలి