‘బాహుబలి’ మలయాళం ఆడియో రిలీజ్ డేట్

‘బాహుబలి’ మలయాళం ఆడియో రిలీజ్ డేట్

Published on Jun 17, 2015 3:52 PM IST

Baahubali-pposter
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గత రెండున్నర ఏళ్ళుగా ఎంతో కష్టపడి చేస్తున్న భారీ విజువల్ వండర్ ‘బాహుబలి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన ప్రాత్రాలు పోషించిన ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదాటగా ‘బాహుబలి – ది బిగెనింగ్’ అనే ఫస్ట్ పార్ట్ ని జూలై 10న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్ర టీం ప్రమోషన్స్ కూడా ఊపందుకుంటున్నాయి.

ఇటీవలే ఈ సినిమా తెలుగు ఆడియోని తిరుపతిలో భారీ ఎత్తున జరిపారు. తాజా సమాచారం ప్రకారం జూన్ 27వ తేదీన మలయాళ వెర్షన్ ఆడియోని రిలీజ్ చేయనున్నారు. ఈ ఆడియో వేడుక కేరళలోని కొచ్చిలో జరగనుంది. ఈ వేడుకకి ఈ చిత్ర టీంతో పాటు పలువురు మలయాళ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఇటీవల విడుదలైన తెలుగు ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కీరవాణి అభిమానులు సాంగ్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ భారీ బడ్జెట్ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.

తాజా వార్తలు