ఓటిటి సమీక్ష: ‘బామ్మ చెప్పిన కథ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

bhamma cheppina katha

ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : ఫిబ్రవరి 15, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : బాబు మోహన్, వై విజయ, సాయి సోహాన్, వినీష
దర్శకత్వం : గురు కిరణ్ బత్తుల
నిర్మాత : విజయ శాంతి శ్రీనివాస్ తాడిపర్తి
సంగీతం : ఆదిత్య బి.ఎన్.
సినిమాటోగ్రఫీ : జి. రాకేష్ గౌడ్
ఎడిటింగ్ : జి. రాకేష్ గౌడ్, చిరంత్ కేశవమూర్తి

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రం “బామ్మ చెప్పిన కథ”. వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ప్రేమించుకొని ఇంట్లో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న యువజంట గంగ (వినీష) మోహిత్ (సాయి సోహాన్) లకి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. అయితే మోహిత్ మాత్రం ఎప్పుడూ తన భార్యతో ఎక్కువగా గొడవలు పడుతూ ఉండడంతో వారితోనే ఉండే ఇతర ఫ్లాట్ లలో వారు చాలా డిస్టబ్ అవుతారు. అలా వారి గొడవలతో విసిగి వేసారిపోయిన ఓ వృద్ధురాలు జగదాంబ (వై విజయ) పోలీస్ అనేవాడు అసలు నేరస్తుడు నేరం చెయ్యక ముందే అతన్ని పట్టేసుకోవాలి అనే ఫిలాసఫి తనకి తానే ఒకటి పెట్టుకున్న ఎస్సై చలపతిరావు (బాబూ మోహన్) వద్దకి ఈ పంచాయతీ తీసుకెళ్తుంది. ఈ తర్వాత ఏమైంది? మోహిత్ విషయంలో జరిగిన ఒక ఊహించని సంఘటన ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రం ఆరంభంలోనే మనకి కనిపించేవి నిజాలా.. మనకి మాత్రమే మాత్రమే నిజాలా అనే లైన్ తో ఇది మొదలవుతుంది. అయితే ఈ పాయింట్ కి తగ్గట్టుగానే ఇందులో సాగిన కథనం ఎక్కడా పక్క దారి పట్టకుండా చాలా ఇంట్రెస్ట్ గా సాగుతూ వెళుతుంది.

ముఖ్యంగా చూసే ఆడియెన్ దృష్టి కోణాన్ని మనం చూస్తుంది ఒకటే అయినా అందులో అంతర్లీనంగా మరో కోణాన్ని చూపిస్తూ తీసుకెళ్లిన విధానం ఈ లఘు చిత్రంలో మరింత ఆసక్తిగా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఒకింత సస్పెన్స్, అదే విధంగా సాలిడ్ ఎమోషన్స్ సహా కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.

ఇక నటీనటుల పరంగా కూడా ఈ లఘు చిత్రం ప్రామిసింగ్ గా ఉందని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ ఇద్దరు నటీనటులు వినీష, సాయి సోహాన్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా సాయి సోహాన్ తన నటనతో ఆశ్చర్యపరిచాడు. తన పాత్రలోని షేడ్స్ ని బాగా పండించారు.

ఇక సీనియర్ నటులు బాబు మోహన్, వై విజయ తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి తమ పాత్రల్లో చాలా బాగా చేశారు. వీరి ట్రాక్ లు, ఫన్ తో పాటుగా మంచి థ్రిల్స్ కూడా పంచుతాయి. అంతే కాకుండా విజయ గారిపై ఓ ఇనోసెంట్ ట్విస్ట్ కూడా ఇందులో ఇంప్రెస్ చేస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఇందులో కథనం ఒకింత ఇంట్రెస్టింగ్ గానే అనిపించినప్పటికీ కొంచెం సమయం తర్వాత ఇదంతా ఒక డ్రామా సెటప్పా అనే రీతిలో డౌట్ రావచ్చు.. దీనిని ఊహించిన వారు అయితే కొద్దిగా కథనం ఊహించగలరు. అలాగే ఇందులో జెనరల్ ఆడియెన్స్ అక్కడక్కడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

అలాగే ఒకింత కథనం కొంచెం స్లోగానే ఉంది. ఇంకొంచెం ఫాస్ట్ పేస్డ్ గా కంటెంట్ ని కట్ చేయాల్సింది. అలాగే వై విజయ గారి పాత్ర చూసేందుకు మంచి క్లాస్ గా కనిపిస్తుంది కానీ మరీ అంత అవుట్ డేటెడ్ గా ఇప్పటికీ ఉంటారా అనే ఓ ప్రశ్న కూడా ఆడియెన్ లో రాకపోదు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో టెక్నీకల్ టీం పనితనం మాత్రం పక్కాగా ఉందని చెప్పవచ్చు. ఫస్ట్ షాట్ తోనే కెమెరా మెన్ వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. అక్కడ నుంచి సంగీతం, మొత్తం సెటప్ ప్రొడక్షన్ డిజైన్ లు చాలా నీట్ గా సెట్ చేయబడ్డాయి. అయితే ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్ గా సెట్ చేస్తే సరిపోయేది.

ఇక దర్శకుడు శ్రీ మల్లాది వెంకటకృష్ణ మూర్తి గారి అనువాద కథ ఆధారంగా తెరకెక్కించిన తీరు ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్ గా తన విజన్, తన టేకింగ్ తో చూపించిన కొన్ని సీన్స్ సూపర్బ్ గా అనిపిస్తాయి. ఆరంభంలోనే వచ్చే విమానం సన్నివేశం, నేల మీద నుంచి గోడపై రక్తపు మరకలు వరకు చూసే వీక్షకుడి మైండ్ తో తాను గేమ్ ఆడుకునట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా నటీనటులు నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ లు కూడా తాను రాబట్టారు. అయితే చిన్న ఫ్లాస్ ఉన్నాయి కానీ తన మిగతా వర్క్ మాత్రం ప్యాకెడ్ గా ఉంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘బామ్మ చెప్పిన కథ’. రీసెంట్ గా ఈటీవీ విన్ నుంచి వచ్చిన గత లఘు చిత్రాలతో పోలిస్తే ఒక డీసెంట్ అటెంప్ట్. రిఫ్రెషింగ్ గా కనిపించే టేకింగ్, నటీనటుల పెర్ఫామెన్స్ లు, ముఖ్యంగా దర్శకుడు పనితనం ఇందులో మెప్పిస్తాయి. ఒక డిఫరెంట్ డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లాంటి దానిని చూడాలి అనుకుంటే ఈ షార్ట్ ఫిలిం ని చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version