భారీ సెక్యూరిటీ మధ్య ఐకాన్ స్టార్.. ఎందుకంటే..?

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ కాంబినేషన్‌లో వైజాగ్ ఇన్ఓర్బిట్ మాల్‌లో నిర్మించిన AAA సినిమాస్ ఆగస్టు 9న ప్రారంభం కానుంది. ముంబై షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని అల్లు అర్జున్ ఈ వేడుకలో స్వయంగా పాల్గొననున్నాడు.

అయితే, గతంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనల దృష్ట్యా, భారీ సెక్యూరిటీతో కేవలం ఆహ్వానితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు ఆర్గనైజర్స్. ప్రారంభ వేడుకలో సామాన్య జనాలకు ఎంట్రీ ఇవ్వకూడదని.. అల్లు అర్జున్ పర్యటన ముగిశాకే ఇతరులకు లోనికి అనుమతి ఇవ్వాలని ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఎనిమిది స్క్రీన్ల మల్టీప్లెక్స్‌లో అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఆగస్టు 10 నుండి ఈ థియేటర్లు సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

Exit mobile version