సమీక్ష : బ్యాడ్ గాళ్స్ – రొటీన్ ప్లాట్‌తో సాగే యూత్‌ఫుల్ డ్రామా

Bad-Girlz

విడుదల తేదీ : డిసెంబర్ 25, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య మరియు తదితరులు
దర్శకుడు : ఫణి ప్రదీప్ ధూళిపూడి
నిర్మాతలు : శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్
సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : అర్లి గణేష్
ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

టాలీవుడ్‌లో క్రిస్మస్ కానుకగా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ‘బ్యాడ్ గాళ్స్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కూడా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన నలుగు అమ్మాయిలు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటారు. పెళ్లికి ముందు తమ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని వారు మలేషియా ట్రిప్‌కు వెళతారు. ఆ ట్రిప్‌లో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి..? వారు ఎలాంటి సమస్యల్లో పడతారు..? వారు తమ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు..? చివరకి ఏం జరిగింది..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఆంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న తమ పాత్రలతో మెప్పించారు. వారు తమ పర్ఫార్మెన్స్‌తో పాటు కామెడీతో ఆకట్టుకుంటారు. మోయిన్, రోహన్ సూర్య కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తారు. ఫస్టాఫ్‌లో వారి పాత్రలు పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా, సెకండాఫ్‌లో కావాల్సినంత ఎంటర్‌టైన్ చేస్తాయి.

అమ్మాయిలను తమకు నచ్చినవిధంగా ఉండనివ్వకపోవడంతో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు.. ఫలితంగా వారు ఎలాంటి విధంగా ప్రవర్తిస్తారు అనేది మనకు ఈ సినిమాలో చక్కగా చూపెట్టారు. అయితే, ఈ క్రమంలో అమ్మాయిలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే అంశాలను కూడా బాగా ప్రెజెంట్ చేశారు.

ఇక ఈ సినిమాలోని సామాజిక అంశం కూడా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. యూత్‌ను మెప్పించే సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కథ చాలా సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తుంది. రొటీన్ కథను ఇంకాస్త బెటర్‌గా ప్రెజెంట్ చేయాల్సింది. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సింది.

ఇక హీరోయిన్లు కూడా తమ యాసతో ప్రేక్షకులను విసిగిస్తారు. ముఖ్యంగా వారు ఫస్టాఫ్‌లో మలేషియాకు వచ్చిన సీన్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండి ఉంటే బాగుండేది. రేణు దేశాయ్ లాంటి యాక్టర్‌ను సరిగా వినియోగించులేకపోయారు.

అటు సెకండాఫ్‌ను పూర్తిగా క్రైమ్ కామెడీ జోన్‌తో ముందుకు తీసుకెళ్లడంలోనే దృష్టి సారించడంతో మెయిన్ ప్లాట్ ట్రాక్ తప్పినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా అంతగా వర్కవుట్ కాలేదని చెప్పాలి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి రాసుకున్న కథ చాలా ఫ్లాట్‌గా సాగడంతో సినిమా రొటీన్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సంగీతం పరంగా ఫస్టాఫ్‌లో వచ్చే సాంగ్స్ మెప్పించకపోయినా, సెకండాఫ్‌లో రెండు సాంగ్స్ బాగున్నాయి. బీజీఎం వర్క్ పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం యూత్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చినా రొటీన్ టెంప్లేట్ కారణంగా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోదు. కామెడీ సీన్స్, నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి. స్లోగా సాగే సీన్స్, బోరింగ్ కథనం ఆడియన్స్‌ను మెప్పించవు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాలు ఇష్టపడేవారిని ఈ చిత్రం కొంతవరకే మెప్పిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version