
కామిక్ ప్రేమికులకు కామిక్ కాన్ అనే ఈవెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాని గురించి తెలియనివారికి కామిక్ కాన్ అనేది ఒక భారీ స్థాయి కామిక్ పుస్తకాల సంస్థ. ఈ సంస్థ ఏడాదికి ఒకసారి ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటుంది. ఈ వేడుకలు ఇండియాలో డిల్లీ, ముంబై, బెంగుళూరు మరియు హైదరాబాద్ లలో జరగనున్నాయి
ఈ వేడుకలో అభిమానులు తమతమ అభిమాన కామిక్ సంస్థల దగ్గరకు వెళ్ళి తమకిష్టమైన కామిక్ పబ్లిషర్ ను గానీ, మూవీ మేకర్ ని గానీ ఎంపిక చేసుకుని స్వయానా తిలకించవచ్చు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాహుబలి బృందం హైదరాబాద్ లో ఈ నెల 10నుండి 12 వరకూ జరిగే వేడుకలో పాలుపంచుకోనుంది. అభిమానులకు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు, కాంటెస్ట్ లు ఇచ్చి తమ స్టోర్ ద్వారా సినిమాను ప్రచారం చేయనున్నారు. ఈ సినిమా 2015లో మనముందుకు రానున్న విషయం తెలిసినదే