
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహాబలేశ్వర్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో ప్రభాస్, తమన్నాలతో పాటు ప్రముఖ నటీనటులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం మహాబలేశ్వర్ లో గజగజ వణికించే చలి ఉన్నా బాహుబలి టీం మాత్రం ఆగకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
‘బాహుబలి కోసం మాహబలేశ్వర్ లో షూట్ చేస్తున్నాం, ఇక్కడ బాగా చలిగా ఉంది.షూటింగ్ స్పాట్ మాకు వెచ్చదనాన్ని ఇచ్చే ఈ మంట నాకు బెస్ట్ ఫ్రెండ్ అని’ తమన్నా ట్వీట్ చేసింది. ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు..