ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. ‘హనుమాన్’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma), ఇప్పుడు కుమారస్వామి నేపథ్యంలో ఒక పౌరాణిక చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకు ప్రశాంత్ వర్మ కథను అందించి, నిర్మాణ పర్యవేక్షణ చేయనుండగా.. విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించి, చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ప్రశాంత్ వర్మ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఇలాంటి వైవిధ్యమైన పౌరాణిక గాథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. సముద్రఖని వంటి ట్యాలెంటెడ్ దర్శకుడు ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయనుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
మరోవైపు, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా రాబోతున్న ‘జై హనుమాన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా పట్టాలెక్కనుంది.
