ఇంట్రెస్టింగ్ గా ‘బకాసుర రెస్టారెంట్‌’ ఫస్ట్‌లుక్‌

bakasura

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ కమెడియన్స్ లో ప్రవీణ్ కూడా ఒకరు. మరి ప్రవీణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమానే ‘బకాసుర రెస్టారెంట్‌’. దీనికి ముందు తాను ఇదే టైటిల్ పేరిట రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాడని పలు రూమర్స్ వచ్చాయి కానీ అవి కాకుండా సినిమా అని ఇపుడు రివీల్ అయ్యింది. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ప్రవీణ్‌ పెద్ద గరిటెతో వంట చేస్తుండటం.. ఆ పక్కనే ఇతర పాత్రలు ఆ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి.

ఆ పోస్టర్‌లోనే గమనిస్తే వైవా హర్ష, షైనింగ్‌ ఫణి మరో వైపు విచిత్రంగా సమ్‌థింగ్‌ స్పెషల్‌ పాత్రలుగా కనిపిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది.ప్రమోషనల్‌ భాగంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ.. ”హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాలు అలరించే అంశాలున్నాయి. ప్రతి సన్నివేశం అందరికి ఎంతో థ్రిల్ల్‌ను పంచుతుంది. ప్రవీణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా ఇది ఉండబోతుంది. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

Exit mobile version