ఎవరూ లేకపోతే తానే రంగంలోకి దిగుతానంటున్న బాలకృష్ణ !

balakrishna
సంక్రాంతి బరిలోకి తన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో దిగి భారీ విజయాన్ని అందుకున్న సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చిత్ర సక్సెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకి మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయి ప్రమోషన్లలో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో దర్శకత్వం ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్నకు చాలా ప్రత్యేకంగా జవాబు చెప్పారు. తనలోని భిన్నమైన ఆలోచనలను, భావనలకు సరిపోయే దర్శకుడు టాలీవుడ్ పరిశ్రమలో దొరకనప్పుడు తానే స్వయంగా దర్శకత్వంలోకి దిగుతానని అన్నారు. అలాగే తన వారసుడు మోక్షజ్ఞ రంగ ప్రవేశం ఈ ఏడాది ఆఖరులో ఉంటుందని కూడా అన్నారు. ప్రస్తుతం బాలయ్య శాతకర్ణి సినిమా ప్రమోషన్ల కోసం యూఎస్ వెళ్లనున్నారు.

Exit mobile version