పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో రాబోతున్న బోయపాటి బాలయ్య సినిమా ?

Boyapati Srinu balakrishna

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలయిందని తెలుస్తోంది.ప్రముఖ రచయిత ఎమ్ రత్నం ఈ చిత్ర కథను రాసే పనిలో ఉన్నారు. అయితే ఈ చిత్రంలోని చాలా భాగం రాజకీయ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి ఎండగట్టే విధంగా మంచి పవర్ ఫుల్ గా ఈ స్క్రిప్ట్ ఉంటుందట.

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న బాలయ్యకు ఆయన పొలిటికల్ కెరీర్ కు సహాయపడే విధంగా ఈ సినిమాను రూపొందించాలని ఇప్పటినుంచే చిత్రబృందం ప్రణాళికలను రూపొందిస్తున్నారట. ఇక బోయపాటి బాలయ్యలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చే చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సారి ఆ అంచనాలను ఈ ఇద్దరు రిచ్ అవుతారో లేదో చూడాలి.

Exit mobile version