ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా‘ (Euphoria) ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘దైవతిరుమగల్’ (నాన్న) వంటి చిత్రాలతో మెప్పించిన సారా అర్జున్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ చిత్రం తన వైవిధ్యమైన కంటెంట్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బోల్డ్ మరియు సామాజిక అంశాలతో కూడిన కథాంశం కావడంతో దీనికి ‘A’ సర్టిఫికేట్ లభించింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ వేదికపై ఈ సినిమాను చూసే అవకాశం కలగడంతో, ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.
ఈ సినిమాలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్ వంటి దిగ్గజ నటులతో పాటు రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నీలిమ గుణ మరియు యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. వైవిధ్యమైన చిత్రాలను ఇష్టపడే వారికి ‘యుఫోరియా’ (Euphoria) ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి
