
నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ‘జిల్లా’ రీమేక్‌లో నటించనున్నారని సినీ వర్గాల సమాచారం. ‘జిల్లా’ తెలుగు రీమేక్‌లో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయంలో రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. నిన్నటి వరకూ వెంకటేష్, రవితేజలు ఈ రీమేక్‌లో నటిస్తున్నారనే వార్త రాగా, ఇప్పుడు తాజాగా ఈ మల్టీస్టారర్ జాబితాలోకి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ వచ్చిపడింది. విజయ్, మోహన్‌లాల్‌లు నటించిన తమిళ సినిమా ‘జిల్లా’.. గత సంవత్సరం పొంగల్‌కు విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
జిల్లా తెలుగు రీమేక్‌కు సముద్ర పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా బాలయ్య, కళ్యాణ్ రామ్ ఇద్దరికీ నచ్చిందనీ, కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. బాబాయ్ బాలయ్యతో నటించాలన్న ఆసక్తిని పటాస్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది.