మాటల రచయిత సాయి మాధవ్ బాలయ్య బాబు కోసం ఓ కథను రాశాడని.. ఇప్పటికే బాలయ్యకు కథ కూడా వినిపించడం జరిగిందని.. సాయి మాధవ్ కథను బాలయ్య ఓకే చేసాడని తెలుస్తోంది. కథలో వైవిధ్యం బాలయ్యకు బాగా నచ్చిందట. కాగా ఈ కథ ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ అట. అందుకే బాలయ్య వెంటనే అంగీకారం తెలిపాడట. ఇక ఈ సినిమాని డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందట. అయితే 2022 ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నారట టీమ్.
మొత్తానికి బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న అఖండ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో బాలయ్య కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు. అలాగే టీజర్ లో అఘోరగా పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో కనిపించి అభిమానులను బాగానే అలరించారు.
