సంక్రాంతి 2027 : బాలయ్య ప్లానింగ్ వేరుగా ఉందిగా..!

NBK111

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్‌కు ఉండే క్రేజ్ వేరు. పండుగ సీజన్‌లో సినిమాను రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని చిత్ర మేకర్స్ భావిస్తుంటారు. పండుగ సమయంలో సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. ఇదే క్రమంలో 2027 సంక్రాంతి బరిలో తమ సినిమాలను లైనప్ చేస్తున్నారు స్టార్ హీరోలు.

2027 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున సిద్ధమవుతున్నారు. కానీ, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన ప్లానింగ్ మార్చాలని చూస్తున్నాడట. దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య NBK111 అనే ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమాను సంక్రాంతి 2027 బరిలో కాకుండా డిసెంబర్ 2026లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

డిసెంబర్ నెలలో సినిమాను రిలీజ్ చేస్తే తమ చిత్రానికి కలెక్షన్స్ భారీగా వస్తాయని NBK111 మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేయనున్నారు.

Exit mobile version