నందమూరి బాలకృష్ణ ఈమధ్య చేసిన సినిమాల్లో చాలా వరకు ఇద్దరు హీరోయిన్లు కామన్ అయిపోయారు. ‘లెజెండ్, లయన్, జైసింహ, డిక్టేటర్, పైసా వసూల్’ ఇలా చాలా సినిమాల్లో ఇద్దరు భామలతో రొమాన్స్ చేసిన ఆయన అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘రూలర్’ చిత్రంలో కూడా సోనాల్ చౌహాన్, వేదికలతో కలిసి నటించారు.
అలాగే త్వరలో బోయపాటి శ్రీను డైరెక్షన్లో మొదలుపెట్టనున్న కొత్త సినిమాలో కూడా బాలయ్య కోసం ఇద్దరు హీరోయిన్లు ఉంటారని వినికిడి. వారిలో ఒకరు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోయిన్ కాగా ఇంకొకరు కొత్త హీరోయిన్ అని సినీ వర్గాల టాక్. మరి ఆ ఇద్దరు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. డిసెంబర్ నెలలో లాంఛ్ కానున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నాడు.
