పెనుకొండ బాధితులను పరామర్శించిన బాలకృష్ణ

balakrishna
టాలీవుడ్ స్టార్ హీరో మరియు పొలిటీషియన్ అయిన నందమూరి బాలకృష్ణ నిన్న పెనుకొండ దగ్గర జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించారు. నిన్న అనంతపురం జిల్లా మడకశిర – పెనుకొండ మార్గంలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు ఓ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 16మంది చనిపోయారు. అందులో 13 మంది చదువుకునే పిల్లలే ఉండడం మరింత బాధాకరమైన విషయం. అంతే కాకుండా మరో 40 మంది గాయాల పాలయ్యారు.

గాయపడి సీరియస్ గా ఉన్నవారిని వెంటనే బెంగుళూరు హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. ఈ రోజు ఉదయం హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన బాలకృష్ణ అక్కడున్న భాదితులను పరామర్శించాడు. ఆయన అక్కడ ఉన్నవారికి కొండంత ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండాఆ కుటుంబాలను గవర్నమెంట్ నుంచి సాయం అందేలా చూస్తానని తెలిపాడు. అలాగే అక్కడి వారిని కాపాడటానికి డాక్టర్స్ తమ సహాయ శక్తులా కృషి చేస్తున్నారని మీడియాకి తెలిపాడు.

Exit mobile version