ట్రైలర్‌తో వచ్చేస్తున్న ఫహద్ ఫాజిల్.. బాలయ్య వాయిస్‌తో ఫ్యాన్స్‌కి పూనకాలే..!

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. శశాంక్ యేలేటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో ఆడియన్స్‌లో అంచనాలు క్రియేట్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో నందమూరి అభిమానులతో పాటు సినిమా లవర్స్‌కు ఈ చిత్ర యూనిట్ ఓ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌కు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలయ్య గతంలో ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో చెప్పిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఈ ట్రైలర్‌లో వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. బాలయ్య డైలాగ్‌తో రాబోయే ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్ర ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

Exit mobile version