మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
రవితేజ నటన, బలమైన కథాంశం థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం, ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఇరుముడి’, ప్రస్తుతం ఇండియా వైడ్‌గా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా, అన్ని వర్గాల ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో శ్రీగౌరి ప్రియా హీరోయిన్‌గా నటించగా బేబి నక్షత్ర, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ అసెట్‌గా నిలిచింది.
