సైమా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా బాలకృష్ణ

balakrishna
సౌతిండియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సైమాకు ఓ ప్రత్యేక శైలి ఉంది. దుబాయ్‌లో అంతర్జాతీయ అవార్డుల స్థాయిలో జరిగే ఈ అవార్డు వేడుక రెండురోజుల పాటు కన్నుల పండువగా జరుగుతుంది. 2012లో మొదలైన ఈ అవార్డ్స్ గత మూడేళ్ళుగా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇక ఈ ఏడాది కూడా ఈ వేడుకను దుబాయ్‌లోనే పెద్ద ఎత్తున నిర్వహించారు. సౌతిండియన్ సినిమాలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం ఇలా ఒక్కో భాషా సినిమాలకు వేర్వేరుగా అవార్డులను ప్రకటించారు.

తెలుగులో ఉత్తమ నటుడు అవార్డును ‘లెజెండ్’ సినిమాకు గానూ నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ఆయనే విచ్చేసి అవార్డును స్వీకరించారు. ఇక తెలుగుతో పాటు మిగతా మూడు భాషలకు సంబంధించిన పలు ఇతర క్యాటగిరీల్లో అవార్డులను కూడా ఈసందర్భంగా నిన్ననే ప్రదానం చేశారు. తారల తళుకులు, డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు, స్కిట్‌లతో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Exit mobile version