ఫిబ్రవరి నుంచి బాలయ్య 99వ మూవీ

ఫిబ్రవరి నుంచి బాలయ్య 99వ మూవీ

Published on Jan 23, 2015 7:00 PM IST

balakrishna1
నందమూరి బాలకృష్ణ ప్రసతుతం ప్రజా నాయకుడిగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే, సినిమా షూటింగ్ లకి కూడా సమయం కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తన 98వ సినిమా ‘లయన్’ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన ఇప్పటికే తన 99వ సినిమాకి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి రాసిన కథకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ 99వ సినిమాకి శ్రీ వాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని సమాచారం. ఫిబ్రవరి చివర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. శ్రీ వాస్ బాలకృష్ణని కొత్తగా చూపించేలా డిజైన్ చేసుకుంటున్నాడు. మరో వైపు బాలకృష్ణ కూడా ఈ సినిమా లుక్ మరియు గెటప్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

తాజా వార్తలు