
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏంత పెద్ద హిట్ అయ్యిందో అదే రీతిలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించిన రాధిక ఆప్టేకి కూడా అంతే అంతే గుర్తింపు ఇచ్చింది. ఈ భామ భాషతో సంబంధం లేకుండా వరుసగా పలు భాషల్లో సినిమా చేస్తోంది. తాజాగా రాధిక ఆప్టే హిందీ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. త్వరలోనే ఫహద్ ఫస్సిల్ నటించనున్న మలయాళ సినిమా షూటింగ్ మొదలు పెట్టనుంది.
గత కొద్ది రోజులుగా రాధిక ఆప్టే నటించిన 14 సినిమాలు ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన రాధిక ఆప్టే ‘ నేను కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాను కానీ నేను నటించిన 14 సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ అవ్వడం లేదు. ప్రస్తుతం కొన్ని ఇంటర్నేషనల్ సినిమాలు చేస్తున్నాను. రోహిత్ బాత్ర ‘ది ఫీల్డ్’, లీన యాదవ్ ‘పర్చేడ్’, కేతన్ మెహత ‘ది మౌంటెన్ మాన్’ సినిమాల్లో నటిస్తున్నానని’ తెలిపింది. అన్ని భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామ ఇంటర్నేషనల్ లెవల్లో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం..