‘బాలమిత్ర’ విడుదల తేదీ ఖరారు

Balamithra to release on Feb 26th

విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చిత్ర దర్శకనిర్మాత శైలేష్ తివారి మాట్లాడుతూ.. ‘‘బాలమిత్ర చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో పాటు మంచి ఎమోషన్ నిండిన కథతో ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఉంటుంది. యాక్షన్ కింగ్ అర్జున్‌గారు విడుదల చేసిన చిత్ర ట్రైలర్‌కి, అలాగే ‘వెళ్లిపోమాకే’ సాంగ్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చింది. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా కూడా కంటెంట్, టేకింగ్ పరంగా పెద్ద సినిమాలకు పోటాపోటీకి ఉంటుందని చెప్పగలను. ఫిబ్రవరి 26న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమా నిర్మాణంలో నాకు సహకరించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

Exit mobile version