కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం టీజర్ వచ్చేనెలలో దసరా కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. `జైసింహా` వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం తరువాత షెడ్యూల్ ను అక్టోబర్ 5వ తేదీ నుండి హైదరాబాద్ లో ప్రారంభమవ్వనుంది. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనపడతారు. కాగా ఇటీవల విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. మరి త్వరలో విడుదల కానున్న రెండో లుక్ కి ఇక ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో చూడాలి.
మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
