ఈ మధ్యలోనే మన టాలీవుడ్ లో ఎన్ని సినిమాలకు రిలీజ్ డేట్స్ వచ్చేసాయో తెలిసిందే. మరి ఇదే ఊపులో నందమూరి ఫ్యాన్స్ కూడా నట సింహం బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వస్తున్న మరో హ్యాట్రిక్ భారీ యాక్షన్ చిత్రం రిలీజ్ డేట్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఆ డేట్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.
నిన్న రాత్రే ఆ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి ఇప్పుడు ఆ డేట్ ను ఎప్పుడు రివీల్ చేస్తారో అన్నది క్లారిటీ ఇచ్చారు. ఈ సాలిడ్ కాంబో విడుదల తేదీని ఈరోజు సాయంత్రం 3 గంటల 36 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ వారు క్లారిటీ ఇచ్చారు. మరి మాంచి రసవత్తర పోటీ నెలకొన్న ఈ సమయంలో వీరు ఏ డేట్ తో ముందు వస్తారో చూడాలి.
The much awaited #BB3 release date announcement Today at 3:36PM????.
Stay tuned!!#NBK106 #BalayyaBoyapati3#NandamuriBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/zfH9kU374n— Dwaraka Creations (@dwarakacreation) January 31, 2021
