
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం రంపచోడవరంలో జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తను 4, 5 రోజుల క్రితమే ఈ చిత్ర టీంతో జాయిన్ అయ్యింది. కానీ త్రిష షూటింగ్ లో మాత్రం ఒకరోజే పాల్గొంది మిగతా టైం అంతా రాజమండ్రిలోని హోటల్ లో గడపాల్సి వస్తోంది. దీనికి కారణం వర్షం.
రంపచోడవరం ఏరియాలోని ఓ ఫారెస్ట్ లో ఈ చిత్ర టీం ముందుగా బాలకృష్ణ – త్రిష పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చెయ్యాలని ప్లాన్ చేసారు. కానీ వర్షం కారణంగా షూటింగ్ ఆగిపోయింది. వర్షం తగ్గితే అనుకున్న దాని ప్రకారం యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తారు లేదంటే ఈ చిత్ర టీం హైదరాబాద్ కి తిరిగి వచ్చి సిటీలో తీయాల్సిన సీన్స్ ని షూట్ చేస్తారు.
హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో ఓ పాత్ర కోసం తన లుక్ ని కూడా మార్చుకున్నాడు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.