ఇద్దరు భామలతో ‘లయన్’ లాస్ట్ సాంగ్ ఫినిష్ చేసిన బాలయ్య

balayya-lion
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లయన్’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అందులో ఒకరి పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ పాత్రైతే, మరొకటి మనలో ఒకడిగా తిరిగే కామన్ మాన్ పాత్ర. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలోని చివరి సాంగ్ ని గత కొద్ది రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో షూట్ చేసారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటలో బాలకృష్ణతో పాటు రాధిక ఆప్టే – త్రిష కూడా స్టెప్పులేసారు.

ఈ సాంగ్ షూటింగ్ ఈ రోజుతో ముగిసింది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ పాటలో ప్రముఖ నటీనటులు కూడా కనిపిస్తారు. ఈ పాటతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇక కొన్ని సీన్స్ మరియు ప్యాచ్ వర్క్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో ని మార్చి 28న రిలీజ్ చేసి సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. టీజర్ తో అభిమానుల్లో అంచనాలు పెంచేయడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ వారు 6 కోట్లకి సొంతం చేసుకున్నారు.

Exit mobile version