పక్కా ప్లానింగ్ తో బాలయ్య!

balayya-gopichand-malineni-

నందమూరి నటసింహం మాస్ గాడ్ బాలయ్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం తన కెరీర్ 111వ చిత్రం దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కాకుండా 112వ సినిమాని కూడా బాలయ్య దర్శకుడు కొరటాల శివతో లాక్ చేసేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. మరి తన సినిమాల విషయంలో బాలయ్య పక్కా ప్లానింగ్ తోనే ఉన్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ గోపీచంద్ తో సినిమా శరవేగంగా పూర్తి చేస్తుండగా ఈ చిత్రం తర్వాత కొరటాల సినిమా కోసం కూడా ప్లాన్ రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో ఈ రెండు సినిమాలు కూడా పక్కా క్లారిటీతో బాలయ్య మార్క్ స్పీడ్ తో ఆన్ టైం పూర్తి కానున్నాయి అని లేటెస్ట్ బజ్. సో వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలు తన నుంచి గ్యారెంటీగా ఉండొచ్చు. ఇక గోపీచంద్ తో సినిమాని పెద్ది నిర్మాతలు నిర్మాణం వహిస్తుండగా కొరటాల ప్రాజెక్ట్ కి ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించనున్నట్టు టాక్.

Exit mobile version