
నందమూరి బాలకృష్ణ తన ఎం.యెల్.యె పదవి ని ఎంతో భాద్యత గా నిర్వర్తిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ కి చేతి కర్ర సాయం తో వచ్చిన బాలకృష్ణ తన అంకిత భావం తో అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇటివలే ఒక చిత్ర షూటింగ్ లో గాయపడిన బాలకృష్ణ కు కాలి పై 7 కుట్లు పడ్డాయి. ఈ గాయం వల్ల బాలకృష్ణ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవల్సి వచ్చింది.
కొన్ని రోజుల క్రితం కుట్లు విప్పేసారు అయితే గాయం పై ఒత్తిడి పడకుండా వుండడానికి చేతి కర్రని వాడుతున్నారు. ఏది ఏమైనా బాలకృష్ణ తన పదవి పట్ల చూపిస్తున్న అంకిత భావం ఆయనని అందరు ప్రశంసలతో ముంచెత్తెల చేసింది.