నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన హ్యాట్రిక్ సినిమా ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వరుసబెట్టి తమ విడుదల తేదీలను ప్రకటించాయో చూసాము. కానీ బాలయ్య అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మరి ఈ మస్ట్ అవైటెడ్ అప్డేట్ తొందరలోనే రానున్నట్టుగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ వారు నందమూరి అభిమానులను అలాగే ఈ క్రేజీ కాంబో ఫ్యాన్స్ ను అలెర్ట్ చేస్తున్నారు. సో అతి త్వరలోనే ఈ మోస్ట్ అవైటెడ్ కాంబో కూడా విడుదల తేదీ ప్రకటించడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ రోజు ఎప్పుడో చూడాలి.
The much awaited #BB3 update on the way????????
Stay excited!#BB3Update #BalayyaBoyapati3— Dwaraka Creations (@dwarakacreation) January 30, 2021
