
నందమూరి బాలకృష్ణ సినిమాలకు పవర్ ఫుల్ టైటిల్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. కాగా ప్రస్తుతం ఆయన ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది.
అందుకే ఈ సినిమాకి ఒక పవర్ ఫుల్ టైటిల్ ను చిత్రబృందం ఫిక్స్ చేసిందని తెలుస్తోంది. ఇంతకీ టైటిల్ ఏమిటంటే.. ‘గాడ్ ఫాదర్’ అట.
మొత్తానికి టైటిల్ మాత్రం బాగా ఇంట్రస్ట్ గా ఉంది. ఓ దశలో ‘‘మోనార్క్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను బాలయ్య సినిమాకి పెట్టబోతున్నారని బాగా వినిపించింది. ఇప్పుడు గాడ్ ఫాదర్ ను ఫైనల్ చేసున్నారు. బాలయ్య సినిమా కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పెట్టడానికే బాగా ఆసక్తిగా ఉన్నాడని.. ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయపాటి టీం ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

