
పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ మరియు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తన అభిమానులను, తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్న సినిమా ‘లయన్’. బాలకృష్ణ మొదటి సారిగా ఈ సినిమాలో ఓ సిబిఐ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ముందుగా మొదట మే 1న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అన్ని పనులు పూర్తి చేయడానికి కాస్త ఆలస్యం కావడంతో మే మొదటి వారంకి వాయిదా పడింది.
ఈ సినిమాలో బాలకృష్ణని ఎలా చూడచ్చు అని ఈ చిత్ర టీంని అడిగితే ‘ లయన్ సినిమాలో సిబిఐ అధికారిగా బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపుతాడు. నిజాయితీ గల సిబిఐ ఆఫీసర్, న్యాయం ఎప్పుడో వస్తుంది అని ఎదురు చూడడు, తనే ఒక న్యాయస్థానంగా మారి అందరికీ న్యాయం చేస్తుంటాడు. రెండు విభిన్న కోణాల్లో బాలయ్య చూపించే వైవిధ్యం ఆద్యంతం ఆకట్టుకుంటుందని’ అంటున్నారు. సత్యదేవా దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ లయన్ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని రుద్రపతి రమణారావు నిర్మించాడు.