ఫాంటసీ స్టోరీలో ‘బాలయ్య’.. సమ్మర్ నుండి ?


డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య బాబు కలయికలో ఓ సినిమా రాబోతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ లో పూరి బాలయ్య కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. లాక్ డౌన్ తనకు తాజాగా ఆలోచించడానికి అలాగే భిన్నమైన కథలను వ్రాయడానికి అద్భుతమైన అవకాశం అని పూరి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. చెప్పినట్లుగానే పూరి మొదటిసారి ఓ ఫాంటసీ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది.

చారిత్రాత్మకకు చెందిన ఓ రాజు.. పొరపాటున ఈ భూమి మీదకు వస్తే.. అతను తన రాజరికాన్ని చూపించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది మెయిన్ లైన్ అని.. సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా కాస్త వ్యంగ్యంగానే సినిమా నడుస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాని సమ్మర్ తరువాత నుండి మొదలుపెట్టేలా పూరి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి.

Exit mobile version