NBK 111: నెవర్ బిఫోర్ రోల్ లో బాలయ్య!?

NBK 111: నెవర్ బిఫోర్ రోల్ లో బాలయ్య!?

Published on Apr 25, 2026 9:03 AM IST

NBK-111

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా తన 111వ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే మొదట ఓ భారీ హిస్టారికల్ సినిమాగా అనుకున్నారు కానీ తర్వాత ప్లాన్ లు మారాయి. ఇలా బాలయ్య ఇప్పుడు ఊహించని రోల్ ని పోషిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈసారి బాలయ్య ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ అవతారమెత్తినట్టు తెలుస్తుంది. ఈ తరహా పాత్రల్లో బాలయ్య చేసింది చాలా తక్కువ. ఇక ఇందులో డార్క్ షేడ్స్ కూడా ఉంటే బాలయ్య అభిమానులకి అది మరో ఫీస్ట్ గా నిలుస్తుంది. వీరసింహా రెడ్డి లాంటి సాలిడ్ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ రాబోతుండగా అభిమానుల్లో మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాని పెద్ది మేకర్స్ వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు