అపారమైన ప్రేక్షకాదరణ కలిగి ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు ఉన్న లక్షలాది మంది అభిమానులను కలిపి ఒక్కడితో కలిపితే ఎంత ఎనర్జీ ఉంటుందో ఆ రేంజ్ ఎనర్జీను మన టాలీవుడ్ నిర్మాత మరియు పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ అందిస్తారు.
“గబ్బర్ సింగ్” లాంటి భారీ బ్లాక్ బస్టర్ ను ఇండస్ట్రీకు ఇచ్చిన బండ్ల ఇప్పటికే కొన్ని వందల సార్లు పవన్ పై తనకున్న అభిమానాన్ని బండ్ల గణేష్ వ్యక్త పరిచారు. ఇప్పటికీ వ్యక్తం చేస్తూనే ఉంటారు అందుకే పవన్ విషయంలో బండ్ల చెప్పే ప్రతీ మాట మిగతా పవన్ అభిమానులకు ఎంతో కిక్కిస్తుంది. అయితే మరోసారి బండ్ల గణేష్ పవన్ ప్రేమకు దాసోహం అంటున్నాడు.
పవన్ మరియు అనా దంపతులు నిన్ననే సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులకు క్రిస్మస్ గిఫ్ట్ ను పంపగా నమ్రత ధన్యవాదాలు తెలిపారు. మై అలాగే పవన్ నుంచి బండ్ల గణేష్ కు కూడా గిఫ్ట్ వెళ్లడంతో దానిని వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో దగ్గర పెట్టి “మీ ప్రేమకు ఎప్పుడు బానిసనే పవన్ కళ్యాణ్ నా దైవం” అంటూ పోస్ట్ చేసిన తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.
https://twitter.com/ganeshbandla/status/1341977869442936832?s=20
