పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఉన్న వీరాభిమానుల్లో నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. తనకి తీన్ మార్ వంటి వైఫల్యం తర్వాత ఇచ్చిన గబ్బర్ సింగ్ బండ్ల గణేష్ జీవితాన్ని మార్చేసింది. అలాంటి తన హీరోతో మరో సినిమా చెయ్యాలని తాను మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే పవన్ తో మరో సినిమా విషయంలో నిర్మాత బండ్ల గణేష్ కొన్ని షాకింగ్ హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. తన బ్యానర్ ని పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియెన్స్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలాంటిది చేసి అప్పుడు బ్యానర్ ని ఆపాలని కోరుకుంటున్నట్టు లేటెస్ట్ పాడ్ కాస్ట్ లో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇలాంటి ఊహించని సినిమా పడాలి అంటే అందుకు కాలం కూడా బాగా కలిసి రావాల్సిందే..
