బన్నీ ఐకాన్ తరువాత ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా?

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న సురేంధర్ రెడ్డి, గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో సైరా వంటి భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆ సినిమా విడుదలై దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా ఆయన ఇంకా కొత్త మూవీ ప్రకటించలేదు. సాధారణంగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేశే సురేంధర్ రెడ్డి కొన్ని స్క్రిప్ట్స్ సిద్ధం చేసుకొని కొందరుస్టార్ హీరోలకు వినిపించాడని సమాచారం. వారు ఒప్పుకున్నా ప్రస్తుతం ఏ ఒక్క స్టార్ హీరో ఖాళీగా లేడు. దీనితో ఆయన మూవీ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది.

ఐతే సురేంధర్ రెడ్డి నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తోనే ఉండొచ్చని గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్న బన్నీ, ఆ తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీ చేయనున్నారు. ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ ఛాయిస్ సురేంధర్ రెడ్డి అని తెలుస్తుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రేసు గుర్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ ఆ మూవీ అందుకుంది. కాబట్టి సురేంధర్ రెడ్డి-బన్నీ కాంబినేషన్ లో మూవీ ఉండవచ్చని అంటున్నారు.

Exit mobile version