మహాభారత ఇతిహాసంలోని కురుక్షేత్ర యోధుడి కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘బర్బరీకుడు (ది సన్నాఫ్ ఘటోత్కచ)’. పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్ పతాకాలపై టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ల శిష్యుడు కృష్ణ భారత ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ రచయిత శివశక్తి దత్త (ఎం.ఎం. కీరవాణి తండ్రి) వద్ద శిష్యరికం చేసిన శివఝాన్సీరేగాల ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. చాలామందికి తెలియని బర్బరీకుడి గొప్పదనాన్ని, ఆయన చరిత్రను నేటి ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించడమే తమ లక్ష్యమని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.
ఈ సినిమాలో ప్రముఖ నటుడు రవిశంకర్ ఒక కీలక పాత్ర పోషిస్తుండగా.. సమ్మెట గాంధీ, జబర్దస్త్ చిట్టిబాబు, ఆనంద్ భారతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తుండగా, జి.ఎం. సతీష్ సంగీతం సమకూర్చుతున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్, భాను మాస్టర్ కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
